టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం
IPL 2025 మ్యాచ్ నెం.5లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రేక్షకులను అలరించాయి. అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ జట్టు 3వ ఓవర్లోనే ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ వికెట్‌ను రబాడా ఓవర్లో కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగుల స్కోరు చేరుకున్నారు. వీరిద్దరి జోడీ 51 పరుగులు జోడించగా, టైటాన్స్ రెండో వికెట్‌ను దక్కించుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య 47 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత…