Headlines
రాజస్తాన్ రాయల్స్

గెలుపుతో నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్

IPL 2025  మ్యాచ్ నెం.62 రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడిన రాజస్తాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా రాజస్తాన్ బౌలర్ ఆకాశ్ మాధ్వాల్ అడ్డుకున్నాడు. గొప్ప ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. CSK ను కట్టడి చేసిన రాజస్తాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే కాన్వే మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోయింది….

Read More
పంజాబ్ కింగ్స్

సెమీఫైనల్స్ చేరువలో పంజాబ్ కింగ్స్ జట్టు

IPL 2025 మ్యాచ్ నెం. 59లో పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరు తో ఆకట్టుకున్న హర్ప్రీత్ బ్రార్ 3 కీలక వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ద మాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తడబడీ నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆరంభం లోనే పంజాబ్ కింగ్స్ జట్టు వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 58-3 పరుగులు సాధించింది. ఈ సీజన్‌ మంచిగా రాణించిన ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభసిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్‌కే అవుట్ అవ్వగా, ఓవెన్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితిలో నీహాల్ వాధేరా మరియు శ్రేయాస్…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ

IPL 2025 మ్యాచ్ No.53 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సూపర్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 1 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగి అభిమానులకు మంచి అనుభూతిని అందించింది. సీజన్‌లో కొనసాగేలా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో KKR జట్టు విజయాన్ని దక్కించుకుని సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వేగంగా పరుగులు సాధించి మంచి ప్రదర్శన కనబరిచిన ఆండ్రే రస్సెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్ మంచిగా రాణించారు. ఈ ఇన్నింగ్స్‌లో గొప్ప ప్రదర్శన…

Read More
ముంబై ఇండియన్స్

రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

ఐపీఎల్ 2025 మ్యాచు నంబరు 50లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య చుట్టు జరిగింది. పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రికెల్టన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం సాధించిన ముంబై ఇండియన్స్ ముంబై జట్టు ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు…

Read More
రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై ఘన విజయం

ఎవరినైనా 14 ఏళ్లప్పుడు జీవితంలో నువ్వు ఏమి సాధిస్తావు? అని అడిగితే వాళ్లు సాధించాలనుకొనే విషయాలన్నీ చెప్పినప్పుడూ అనుమానించకూడదని ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రుజువు చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు ఐపీఎల్‌లో సెంచరీ సాధిస్తాడని చెబితే ఎవరైనా నవ్వుకునేవాళ్లేమో, కానీ ఇక మీదట అలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ అసాధ్యమైన పనిని సాధించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో చాలా రికార్డులు భద్దలు కొట్టాడు. ఈ రోజు ఐపీఎల్‌లో చోటుచేసుకున్న పరిణామం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని ఒక సంఘటనను, చరిత్రలో మిగిలిపోయే కొన్ని అంశాలను ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.47 లో చవిచూసారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసి, అత్యల్ప వయసులో సెంచరీ మరియు ఒకే సెంచరీలో ఎక్కువ బౌండరీలు కొట్టి రికార్డు సాధించాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…

Read More
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరిత విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.42లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబర్చిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు పడగొట్టిన హేజిల్‌వుడ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మంచి స్కోర్‌ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేశారు. అనంతరం ఫిల్ సాల్ట్ 26 పరుగుల వద్ద హసరంగ బౌలింగ్‌లో…

Read More
లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతో విజయం

IPL 2025లో శనివారం జరిగిన డబుల్ హెడ్డర్‌లో రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో IPL చరిత్రలో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అవేశ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌తో రాణించిన రాజస్థాన్ రాయల్స్: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత సందీప్ శర్మ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ LBWగా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో జట్టు…

Read More
ఢిల్లీ

సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీ ధమాకా

IPL 2025 మ్యాచ్ నం.32లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను సంధడిలో ముంచాయి. సూపర్ ఓవర్‌లో 2 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఇరు జట్లు విజయానికి కోసం పోరాడగా, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించిన మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన DC జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు సాధించింది. ఫ్రేసర్ మెక్‌గర్క్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. ఆ…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం 58 పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చూపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రారంభంలోనే మూడో ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్‌తో కలిసి సాయి సుదర్శన్ పవర్‌ప్లేలో 56-1 స్కోరు సాధించారు. 94 పరుగుల వద్ద జోస్ బట్లర్ 36 పరుగులు చేసి థీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు….

Read More
రాజస్తాన్ రాయల్స్

రాజస్తాన్ రాయల్స్ చేతిలో 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పంజాబ్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.18లో రాజస్తాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో రాణించిన రాజస్తాన్ రాయల్స్: పంజాబ్ కింగ్స్‌పై పోరులో రాజస్తాన్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా రాణించారు. పవర్‌ప్లేలో మంచి ప్రదర్శన కనబర్చిన ఈ జోడీ 53 పరుగులు సాధించింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శాంసన్ ఔట్ అయ్యే సమయానికి రాజస్తాన్ జట్టు 89/1 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన…

Read More