Headlines
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం 58 పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చూపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రారంభంలోనే మూడో ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్‌తో కలిసి సాయి సుదర్శన్ పవర్‌ప్లేలో 56-1 స్కోరు సాధించారు. 94 పరుగుల వద్ద జోస్ బట్లర్ 36 పరుగులు చేసి థీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు….

Read More
లక్నో

హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో లక్నో 4 పరుగుల తేడాతో KKRపై విజయం

IPL 2025 మ్యాచ్ నం.21 లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోటీ పడగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 4 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. పవర్‌హిటింగ్‌తో అదరగొట్టిన నికోలస్ పూరన్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు కెప్టెన్ అజింక్య రహానె బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ పవర్‌హిట్టింగ్ LSG జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్క్రమ్ పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 59 పరుగుల భాగస్వామ్యం అందించారు. 99 పరుగుల భాగస్వామ్యంతో పాటు 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్షిత్ రానా…

Read More
పంజాబ్

18 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో చతికిలపడ్డ చెన్నై

IPL 2025 మ్యాచ్ నం.22 లో పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, ఒకవైపు వికెట్లు పడుతున్నా కాలుచేసిన హిట్టింగ్‌తో చెన్నైపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 75/3 పరుగులు చేసింది. తన పవర్ హిట్టింగ్‌తో వేగంగా పరుగులు చేసి కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ప్రియాంశ్…

Read More
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దశాబ్దపు కల, ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో విజయం

IPL 2025 మ్యాచు నెం.20 ముంబయి ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చోటు చేసుకుంది. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్ IPL ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు విజయం కోసం పోటీ పడిన ఈ పోరులో గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ “మాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముంబయి వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతంగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్‌ను ట్రెంట్ బౌల్ట్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పడిక్కల్‌తో కలసి విరాట్ కోహ్లీ پا워ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగులు…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

IPL 2025 మ్యాచ్ నం. 19 గుజరాత్ టైటాన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు పూర్తిగా ఆధిపత్యం సాధించి సన్‌రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో 20 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పవర్‌ప్లేలో గొప్ప ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ జట్టు ని కట్టడి చేశారు. హైదరాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో వరుసగా 4వ మ్యాచ్ లో ఓటమిపాలైంది. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్…

Read More
రాజస్తాన్ రాయల్స్

రాజస్తాన్ రాయల్స్ చేతిలో 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పంజాబ్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.18లో రాజస్తాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో రాణించిన రాజస్తాన్ రాయల్స్: పంజాబ్ కింగ్స్‌పై పోరులో రాజస్తాన్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా రాణించారు. పవర్‌ప్లేలో మంచి ప్రదర్శన కనబర్చిన ఈ జోడీ 53 పరుగులు సాధించింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శాంసన్ ఔట్ అయ్యే సమయానికి రాజస్తాన్ జట్టు 89/1 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్, విజయ యాత్ర 24 పరుగుల తేడాతో CSKపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ తలపడ్డాయి. వరుసగా 3వ మ్యాచ్‌లో సత్తా ఛాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ మరియు అభిషేక్ పోరేల్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 51/1 పరుగులు సాధించారు. అభిషేక్ పోరేల్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, అక్షర్ పటేల్ 21 పరుగులు,…

Read More
లక్నో సూపర్ జెయింట్స్

ముంబయిని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 12 పరుగులతో విజయం 

IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

80 పరుగుల తేడాతో SRH ని చిత్తు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2025 మ్యాచ్ నం. 15 సన్‌రైజర్స్ హైదరాబాదు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అరోరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్ నిలబెట్టారు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 53/2 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ప్రారంభంలో రాణించిన పాట్ కమిన్స్ మరియు మొహమ్మద్ షమీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత రఘువంశీ మరియు నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే కలిసి 81 పరుగుల…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి…

Read More