లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పంజాబ్ పైచేయి, చాహల్ దెబ్బకి కోల్‌కతా చిత్తు
పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అసలైన IPL పోరు చోటుచేసుకుంది. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో PBKS పైచేయి సాధించింది. IPL చరిత్రలోనే అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాసింది. IPL 2025 మ్యాచ్ నెం.31లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో PBKS జట్టు మ్యాజిక్ స్పిన్నర్ యూజీ చాహల్ గొప్ప విజయాన్ని అందించాడు. నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన PBKS జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌తో అలరించిన కోల్‌కతా నైట్ రైడర్స్: పంజాబ్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ త్వరగానే వికెట్లు కోల్పోయారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 54/4 స్కోరు…