ముంబయిని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 12 పరుగులతో విజయం
IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్…