రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై ఘన విజయం

ఎవరినైనా 14 ఏళ్లప్పుడు జీవితంలో నువ్వు ఏమి సాధిస్తావు? అని అడిగితే వాళ్లు సాధించాలనుకొనే విషయాలన్నీ చెప్పినప్పుడూ అనుమానించకూడదని ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రుజువు చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు ఐపీఎల్‌లో సెంచరీ సాధిస్తాడని చెబితే ఎవరైనా నవ్వుకునేవాళ్లేమో, కానీ ఇక మీదట అలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ అసాధ్యమైన పనిని సాధించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో చాలా రికార్డులు భద్దలు కొట్టాడు. ఈ రోజు ఐపీఎల్‌లో చోటుచేసుకున్న పరిణామం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని ఒక సంఘటనను, చరిత్రలో మిగిలిపోయే కొన్ని అంశాలను ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.47 లో చవిచూసారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసి, అత్యల్ప వయసులో సెంచరీ మరియు ఒకే సెంచరీలో ఎక్కువ బౌండరీలు కొట్టి రికార్డు సాధించాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…

Read More