ఈ వారం Tollywoodలో సినిమా సందడి నెలకొంది. ఒకే రోజున విడుదలకు రెండు ప్రముఖ చిత్రాలు పోటీ పడ్డాయి. అలాగే Re-release సినిమాలు కూడా విడుదలయ్యాయి. సినిమా మంచిగా ఉంటే తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను మంచి ఆదరణతో స్వీకరిస్తారు. వీటితో పాటు మరికొన్ని తెలుగు చిత్రాలు రాక్షస మరియు LAMP కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రాలను చూడటానికి Book My Show మరియు Paytm అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
Cinema వివరాల్లోకి వెళితే:
Court: State vs A Nobody సినిమా వాల్‌పోస్టర్ బ్యానర్‌పై హీరో నాని మరియు ప్రసాంతి గారు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడిగా రామ్ జగదీష్ వ్యవహరించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. అలాగే దినేష్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ సినిమా మంచి ట్రైలర్ కట్‌తో విశేష ప్రజాదరణ పొందింది.

అలాగే దిల్‌రుబా చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, విశ్వా కరుణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సంగీతాన్ని సమ్ CS అందించడం జరిగింది.
ఈ వారం విడుదలైన మరో చిత్రం రాక్షస, పోలీస్ ఆఫీసర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ హీరోగా నటించగా, కాశీ K ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకట్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
ఈ వరుసలో LAMP చిత్రం కూడా ప్రేక్షకులను అలరించడానికి విడుదలైంది.

హిందీలో విడుదలై గొప్ప పేరు తెచ్చుకున్న చావా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించి, తన అభినయంతో మంచి పేరు సాధించాడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ నిర్మించారు. సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో అద్భుతమైన చారిత్రక సన్నివేశాలతో మహారాజ్ ఛత్రపతి శంభాజీ గారి నిజ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరెక్కింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు భాషలో ప్రేక్షకులకు అందించింది.
అలాగే Re-release craze మూవీస్ జాబితాలో హీరో కార్తి నటించిన యుగానికి ఒకడు చిత్రం కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది.
for more updates stay with us: Explore Firstlook