Headlines

WPL 2025 ఫైనల్ : ఉత్కంఠభరితమైన పోరులో ముంబై విజయం

WPL

WPL 2025 ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగిన ఉమెన్స్ క్రికెట్ సమరం అభిమానులకు అనేక అనుభవాలను అందించింది. టోర్నీ ఆద్యంతం గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 4 వేదికల్లో 22 మ్యాచ్‌లతో WPL 2025 ముగిసింది. గత 3 సంవత్సరాల్లో Mumbai Indians జట్టు 2 సార్లు ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో Delhi Capitalsపై Mumbai Indians జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో Mumbai Indians జట్టు పైచేయి సాధించింది.

WPL

WPL 2025 ఫైనల్ మ్యాచ్ విశేషాలు:

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Delhi Capitals కెప్టెన్ Meg Lanning ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన Mumbai Indiansకు Marizanne Kapp అద్భుతమైన బౌలింగ్‌తో Delhi Capitals మంచి ప్రారంభాన్ని అందించింది. పవర్‌ప్లే ముగిసేసరికీ Mumbai జట్టు తమ ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి 20/2 స్కోర్ వద్ద నిలవగా, Nat Sciver-Brunt తో కలిసి Mumbai కెప్టెన్ Harmanpreet Kaur చక్కటి భాగస్వామ్యం నెలకొల్పింది. మూడో వికెట్‌కు వీరిద్దరి జోడీ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత Charani బౌలింగ్‌లో Nat Sciver-Brunt క్యాచ్ ద్వారా వెనుదిరిగిన వెంటనే వరుస క్రమంలో Mumbai Indians జట్టు 15 పరుగుల వ్యత్యాసంలో 4 వికెట్లు కోల్పోయింది. Sutherland బౌలింగ్‌లో Kapp అందుకున్న క్యాచ్‌తో వెనుదిరిగిన Harmanpreet Kaur వికెట్ కోల్పోయే సమయానికి Mumbai జట్టు 118/6గా నిలిచింది. తర్వాత చివరి 3 ఓవర్లలో Mumbai Indians జట్టు 31 పరుగులు జోడించి Delhi Capitals ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

చేదన ప్రారంభించిన Delhi జట్టును అద్భుతమైన బౌలింగ్‌తో Mumbai జట్టు మొదటి నుంచి ఒత్తిడిలోకి నెట్టింది. ఇన్నింగ్స్ 2వ మరియు 3వ ఓవర్లలో Delhi Capitals ఓపెనర్లు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత వరుసగా Mumbai జట్టు వికెట్లు దక్కించుకుంది. Delhi Capitals బ్యాటింగ్‌లో Jemimah Rodrigues మరియు Marizanne Kapp తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇన్నింగ్స్ చివరి దశలో Kapp హిట్టింగ్‌తో కొంత మెరిపించినా, Nat Sciver-Brunt బౌలింగ్‌లో Hayley Matthews అందుకున్న క్యాచ్‌తో Kapp వికెట్ చేజారడంతో Delhi Capitals పోరు ముగిసింది.

Mumbai బౌలింగ్‌లో Nat Sciver-Brunt 3 వికెట్లు దక్కించుకోగా, Amelia Kerr 2 వికెట్లు, Shabnim Ismail, Hayley Matthews, Saika Ishaque తలో వికెట్ తీశారు. Delhi బౌలింగ్‌లో Marizanne Kapp, Jess Jonassen, Charani 2 వికెట్లు దక్కించుకోగా, Sutherland కు 1 వికెట్ లభించింది.

WPL 2025 టోర్నీ ముఖ్యాంశాలు:

ఈ టోర్నీలో 3 సీజన్లలో Mumbai Indians జట్టు 2 సార్లు ఛాంపియన్‌గా నిలవగా, ఒకసారి Royal Challengers Bangalore (RCB) జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 3 సీజన్లలో ఫైనల్ చేరుకున్న Delhi Capitals జట్టు 3 సార్లు నిరాశ చెందింది.

  • అత్యధిక పరుగులు: Nat Sciver-Brunt (523) – Mumbai Indians
  • అత్యధిక వికెట్లు: Amelia Kerr (18) & Hayley Matthews (18)

for more stats check official Website wplt20.com, for IPLT20 latest updates visit sports category.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *