గ్రీన్ కార్డు శాశ్వతంగా అమెరికాలో ఉండటానికి హామీ ఇవ్వదు – US Vice President JD Vance

JD Vance on Green card

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గురువారం US Green card గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, యూఎస్ గ్రీన్ కార్డ్ అనేది ఆ దేశంలో అధికారికంగా నివసించడానికి మరియు పని చేసుకునే హక్కును కల్పిస్తుంది.

green card
American Green card

గత సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహమ్మద్ ఖలీల్ అనే గ్రీన్ కార్డ్ కలిగిన యువకుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గత శనివారం, అతడిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో జెడి వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా, ఒక వ్యక్తి అమెరికాలో ఉండాలా వద్దా అనే విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి (Secretary of the State) మరియు అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు.

ఇందులో ముఖ్యమైన కారణాలు:

  • నేరపూరిత చర్యలు చేయడం
  • వలస చట్టాలను ఉల్లంఘించడం
  • నిర్ణయించిన సమయాన్ని మించిపోయి దేశం వెలుపల ఎక్కువ కాలం నివసించడం

సాధారణంగా, అమెరికా పౌరులకు ఉన్న అన్ని హక్కులు, అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా వర్తిస్తాయి. కానీ వారు తీవ్ర నేరాలు చేయడం లేదా దేశ భద్రతను ఉల్లంఘిస్తే, గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయవచ్చని సర్కిల్ ఆఫ్ కౌన్సిల్‌కు చెందిన రస్సెల్ ఏ. స్టామెట్స్ తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కేసులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం ఖలీల్‌పై గ్రీన్ కార్డ్ రద్దు చేయాలని నిర్ణయించగా, తదుపరి విచారణ వరకు ఖలీల్‌ను డిపోర్ట్ చేయరాదని న్యూయార్క్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. ఇది అమెరికా పాలన విధానంలో పెద్ద మార్పుకు నిదర్శనమని స్టామెట్స్ వ్యాఖ్యానించారు.

USCIS ప్రకారం, అమెరికా పౌరులకు ఉన్నట్టుగానే, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి.

https://www.uscis.gov/green-card/

హక్కులు:

  • శాశ్వతంగా అమెరికాలో నివసించవచ్చు. (ఎటువంటి నేరపూరిత చర్యలు చేయనంతవరకు)
  • చట్టపరమైన ఉద్యోగాలు చేసుకోవచ్చు. (హెల్త్‌కేర్, ఐటీ, మాన్యుఫాక్చరింగ్, మీడియా, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ మొదలైన రంగాల్లో)
  • అమెరికా చట్టాల రక్షణ పొందే అర్హత ఉంటుంది.

బాధ్యతలు:

  • అన్ని యూఎస్ మరియు స్థానిక చట్టాలను పాటించడం.
  • ఆదాయపు పన్ను (Income Tax) ఫైల్ చేయడం మరియు ఆదాయ వివరాలను అధికారులకు అందించడం.
  • ఓటు హక్కు లేకున్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేయడం.
  • 18-25 సంవత్సరాల మధ్య ఉన్న పురుషులు Selective Services లో తమ వివరాలను నమోదు చేసుకోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *